SRPT: మునగాల మండలం నేలమర్రి గ్రామంలోని చెరువులో శనివారం సాయంత్రం పలువురు దౌర్జన్యంగా చేపలు పట్టుకెళ్లారని మత్స్య కార్మిక సొసైటీ ప్రతినిధులు ఆరోపించారు. మరసకుంట తండాల వారు గుంపులుగా చెరువులోకి దిగి చేపలు పట్టుకెళ్లారని తెలిపారు. సుమారు రూ.10 లక్షల మత్స్య సంపద నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
మత్స్య సంపద లూటీ.. రూ.10 లక్షల నష్టం


