హైదరాబాద్: 28°C
తెలంగాణ

పర్ణశాల ఘాట్‌లో నిమజ్జనం నిషేధం: తహసీల్దార్

BDK: దుమ్ముగూడెం మండలం పర్ణశాల ఘాట్ వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి అనుమతులు లేవని తహసీల్దార్ మామిడి అశోక్‌కుమార్ శనివారం తెలిపారు. అన్ని గ్రామాల ప్రజలు, గణేష్ ఉత్సవ కమిటీలు విగ్రహాల నిమజ్జనం కోసం భద్రాచలం వద్ద ఉన్న గోదావరి ఘాట్‌లకు మాత్రమే వెళ్లాలని సూచించారు. అధికారులు జారీ చేసిన ఆదేశాలను ప్రజలు, నిర్వాహకులు పాటించాలని అన్నారు.