JGL: మెట్‌పల్లి పట్టణంలోని మహాత్మా జ్యోతిరావ్ ఫూలే బాలుర గురుకుల పాఠశాలను సీనియర్ సివిల్ జడ్జి అరుణ్‌కుమార్ శనివారం తనిఖీ చేశారు. కిచెన్, బాత్రూంలు, స్టోర్‌రూమ్, తరగతి గదులు, వసతి గదులను పరిశీలించారు. హాస్టల్‌లో అపరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల సమస్యలు, ఫిర్యాదులను నమోదు చేసుకున్నారు. పరిస్థితులపై ఉన్నతాధికారులకు నివేదిక అందించాలన్నారు.
తెలంగాణ
గురుకుల పాఠశాలలో జడ్జి తనిఖీ


