హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు ఢీకొని వ్యక్తి మృతి!

NLG: కొండమల్లేపల్లి మండలం దర్గా తండాకు చెందిన శ్రీరాములు (38) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. శనివారం దేవత్‌పల్లి గేటు సమీపంలో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన శ్రీరాములు దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సైదుల లక్ష్మణ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.