హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనన నిరీక్షణ కేంద్రం ప్రారంభం

ASR: చింతపల్లి మండలం కోరుకొండ పీహెచ్‌సీలో రూ.35లక్షలతో నిర్మించిన జనన నిరీక్షణ కేంద్రం శనివారం ప్రారంభమైంది. దీంతో నెలలు నిండిన గర్భిణులు ప్రసవ తేదీకి వారం రోజుల ముందే ఇక్కడికి చేరి వైద్యుల పర్యవేక్షణలో సురక్షితంగా ప్రసవం పొందే అవకాశం ఉంది. గర్భిణిలు పురిటి నొప్పులు వచ్చేవరకు ఉండొద్దని వైద్యాధికారి జగదీష్ సూచించారు. గర్భిణులు దేనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.