హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తులు

TPT: ICDS ప్రాజెక్టు పరిధిలోని పిచ్చాటూరు, నాగలాపురం, కేవీబీపురం, నారాయణవనం మండలాల్లో ఖాళీగా ఉన్న 19 అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీవో రాజేశ్వరి తెలిపారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబరు 21 నుంచి అక్టోబరు 1వ తేదీ సాయంత్రం 5 లోపు రూ.100 రుసుముతో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.