AKP: పాయకరావుపేట మండలంలోని 27 ఎంపీటీసీ స్థానాలకు గాను మొత్తం 91 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీడీవో శరత్ బాబు తెలిపారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో పోలింగ్ కేంద్రాల తుది జాబితాను విడుదల చేశారు. ఈ జాబితా ఖరారుకు ముందు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమై, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
వార్తలు
పాయకరావుపేటలో 91 పోలింగ్ కేంద్రాలు


