హైదరాబాద్: 28°C
వార్తలు

ఏడాది కాలంగా వెలగని వీధి దీపాలు

SKLM: నరసన్నపేట మెయిన్ రోడ్డులో గత ఏడాది కాలంగా వీధి దీపాలు వెలగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రివేళ వాహనదారులు, మహిళలు, వృద్ధులు రాకపోకలకు ఇబ్బంది పడుతూ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే లైట్లు పునరుద్ధరించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.