SRCL: దివ్యాంగ పిల్లలను వేరుగా చూడకుండా వారి నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని మండల విద్యాధికారి బీ.రాజు నాయక్ అన్నారు. తంగళ్లపల్లి భవిత సెంటర్‌లో మండల స్థాయిలో దివ్యాంగ విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. డ్రాయింగ్, రన్నింగ్, మ్యూజికల్ చైర్, క్యారం తదితర పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు తహసీల్దార్ వీ.మురళీకృష్ణ బహుమతులు అందజేశారు.
తెలంగాణ
'దివ్యాంగ పిల్లలను వేరుగా చూడొద్దు'


