హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహాగణపతిని దర్శించుకున్న సీపీ

KNR: హుజురాబాద్‌ మారుతీనగర్‌లో ప్రతిష్ఠించిన మహాగణపతిని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితుడు రాకేష్‌శర్మ సీపీకి వేద ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. గణేష్‌ యూత్‌ అసోసియేషన్‌ సభ్యులు సీపీని శాలువాతో సత్కరించారు.