MNCL: భీమిని మండలం అక్కలపల్లికి చెందిన మీసాల నాందేవ్ కరెంట్ షాక్‌కు గురయ్యాడు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. శనివారం రాత్రి ఇంట్లో విద్యుత్ మరమ్మతులు చేసే క్రమంలో కరెంట్ షాక్ తగలి తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. ఈ క్రమంలో భీమిని PHCకి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
తెలంగాణ
విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డ వ్యక్తి


