KNR: వీణవంక మండలం పోతిరెడ్డిపల్లిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. శనివారం పెట్రోలింగ్ చేస్తుండగా మానేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు కనిపించడంతో పోలీసులు వెంబడించారు. పోలీసులను గమనించిన డ్రైవర్లు ట్రాక్టర్లను అక్కడే వదిలి పరారయ్యారు. వాహనాలను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల దాడి


