హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు: DEO

ప్రణాళికాబద్ధంగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తేనే విద్యారంగంలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని డీఈవో జి. సదానందం తెలిపారు. శనివారం ఖమ్మం సైన్స్ మ్యూజియంలో AMO ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన అకాడమిక్ ప్యానెల్ సమీక్షా సమావేశం నిర్వహించారు. అకాడమిక్ ప్యానెల్ సభ్యులు ఒక్కో మండలాన్ని దత్తత తీసుకుని ఉపాధ్యాయులకు తగిన శిక్షణ అందించాలని ఆదేశించారు.