హైదరాబాద్: 28°C
తెలంగాణ

సంగారెడ్డిలో కామ్రేడ్ మల్లారెడ్డి సంస్మరణ సభ

SRD: సంగారెడ్డి సుందరయ్య భవన్‌లో సీపీఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చుక్క రాములు మాట్లాడుతూ.. మల్లారెడ్డి మృతి రైతు ఉద్యమాలకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఏపీలో రైతు సంఘం బలోపేతానికి, సాగునీటి రంగంపై పోరాటాలకు ఆయన విశేష కృషి చేశారని కొనియాడారు.