KMM: కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి విద్యానగర్ కాలనీలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. భర్తతో కలిసి పొలం వద్ద గడ్డి కోయడానికి వెళ్లిన జయమ్మ(50) పిడుగుపాటుకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కల్లూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. జయమ్మ ఆకస్మికంగా మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
తెలంగాణ
పిడుగుపడి మహిళ మృతి..!


