హైదరాబాద్: 28°C
తెలంగాణ

​దండుపల్లి గ్రామంలో కొత్త ఆకర్షణ

MDK: మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే 'ఐ లవ్ దండుపల్లి' స్టాచ్యూను ఎంపీడీవో ప్రీతి రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఊరికి కొత్త శోభను, ప్రత్యేక గుర్తింపును తెచ్చేలా ఈ బోర్డును ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, ఎంపీవో శ్రీనివాస్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.