HNK: SP పేరుతో ఫోన్ చేసి కేసు నమోదైందంటూ బెదిరించిన సైబర్ నేరగాడు ఓ వ్యక్తి నుంచి రూ.1,05,800 కాజేశాడు. శాయంపేటకు చెందిన గోపాల్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన కొద్దిసేపటికే నిందితుడు ఫోన్ చేసి, అరెస్టు చేస్తామని బెదిరించాడు. జైలు శిక్ష తప్పించుకోవాలంటే డబ్బులు చెల్లించాలని చెప్పి విడతల వారీగా నగదు బదిలీ చేయించుకున్నాడు. దీనితో బాధితుడు పోలీసులను అశ్రయించాడు.
తెలంగాణ
ఎస్పీ పేరుతో బెదిరించి రూ.1.05 లక్షలు కాజేశారు


