హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో రైతు మృతి..!

MHBD: విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన శనివారం MHBD జిల్లా గూడూరు మండలం సీతానగరం శివారు ఆదివారంపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నూనావత్ వాల్యానాయక్ (60) మృతిచెందాడు. సంపుపై ఉన్న విద్యుత్ మోటారు తాడు తీస్తుండగా షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి పెద్ద కుమారుడు వెంకన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI యాదవరెడ్డి తెలిపారు.