KMR: హెచ్‌పీ గ్యాస్ లోడుతో వెళ్తున్న ట్యాంకర్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటన 44వ జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ట్యాంకర్‌కు ఎటువంటి లీకేజీ కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాయపడిన డ్రైవర్‌ను పోలీసులు చికిత్స కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. తప్పిన ప్రమాదం


