WGL: జిల్లాలోని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా ఎన్నికల తుది ఓటర్ల జాబితాను ఎన్నికల అధికారి, జెడ్పీ సీఈవో ఎన్.వసంత శనివారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 3,234 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 24న నామినేషన్లు, 25న పరిశీలన, 26న ఉపసంహరణ ఉంటుంది. అక్టోబర్ 4న అవసరమైతే ఎన్నికలు, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటాయని తెలిపారు.
తెలంగాణ
రెడ్ క్రాస్ తుది ఓటర్ల జాబితా విడుదల..!


