హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీవాల్యూయేషన్‌కు దరఖాస్తులు ప్రారంభం

NZB: TUలో ఇటీవల విడుదలైన బీఎడ్‌, బీపీఎడ్‌ 2, 4 సెమిస్టర్ల రెగ్యులర్‌, 1, 2, 3, 4 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్‌ పరీక్షా ఫలితాలపై రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని COE ఆచార్య సంపత్‌కుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 28లోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు ఫారాలను సంబంధిత కళాశాలల్లో పొందాలన్నారు. వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.