హైదరాబాద్: 28°C
తెలంగాణ

మండపాలను సందర్శించిన ఎస్పీ

BHNG: గణేశ్‌ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఆకాంక్ష్‌ యాదవ్‌ అన్నారు. భువనగిరి పట్టణంలోని పలు గణేశ్‌ మండపాలను ఆయన సందర్శించి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండపాల వద్ద భక్తుల రద్దీ, భద్రతా ఏర్పాట్లు, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు.