హైదరాబాద్: 28°C
తెలంగాణ

నీరు లేని చెరువులో గణనాథున నిమజ్జనం

KNR: వర్షాభావం, ఎల్‌నినో ప్రభావంతో చెరువులు, కుంటలు ఎండిపోయి ఎడారిలా మారుతున్నాయి. కేశవపట్నంలో మఠం ఆధ్వర్యంలో శనివారం గణేష్ నిమజ్జనాన్ని గొల్లపల్లి చెరువులో నిర్వహించారు. ప్రతి ఏటా నీరు నిండుగా ఉండే చెరువులో, ఈసారి నీరు లేకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఆందోళన చెందుతూనే గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చారు. నీరు లేని చెరువులో నిమజ్జనం చేయడం ఎంతో బాధాకరంగా ఉందని వారు వాపోయారు.