హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

BHNG: గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఏపూరి భాస్కరరావు పరిశీలించారు. శనివారం సాయంత్రం బీబీనగర్ చెరువు వద్ద చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిమజ్జనానికి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగవద్దని అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు.