హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తు తెలియని వాహనం ఢీ.. వ్యక్తి మృతి

WGL: రాయపర్తి మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న వీరయ్య (58)ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, పరారైన వాహనం కోసం దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.