హైదరాబాద్: 28°C
తెలంగాణ

శాంతిభద్రతల పరిరక్షణకై ఫ్లాగ్ మార్చ్

HYD: గణేష్ నిమజ్జనం నేపథ్యంలో నగరంలో భద్రతా చర్యలు చేపట్టారు. CP సజ్జనార్, DCP శ్రీనివాస్ ఆదేశాల మేరకు.. బహదూర్‌పుర సీఐ మహమ్మద్ హఫీజ్ ఆధ్వర్యంలో కిషన్‌బాగ్, నజామ్ నగర్, బహదూర్ పురా ప్రాంతాలలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌తో కలిసి పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణ కోసం ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు తెలిపారు.