హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొప్పర్తిని సందర్శించిన రజత్ కుమార్

కడపలోని కొప్పర్తి ఎన్‌ఐసీడీసీ పారిశ్రామిక ప్రాంతంలో రూ.1,006 కోట్లతో చేపట్టిన మౌలిక వసతుల పనులను అక్టోబర్‌ 2028 నాటికి పూర్తి చేయాలని ఎన్‌ఐసీడీసీ సీఈఓ, ఎండీ రజత్ కుమార్ సైని సూచించారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ నిధి మీనా, సబ్ కలెక్టర్ హెచ్‌.ఎస్. భావనతో కలిసి పనులను పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు.