హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

కృష్ణా: పమిడిముక్కల మండలం కపిలేశ్వరపురం గ్రామంలో బీపీ సరోజినీ అనే లబ్ధిదారురాలికి వైద్య చికిత్స నిమిత్తం మంజూరైన రూ. 48,289 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఆపదగా ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.