GNTR: ఫిరంగిపురం మండలం తక్కెళ్లపాడు గ్రామంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు శనివారం దాడి నిర్వహించారు. ఫిరంగిపురం సీఐ కె. భుజంగరావుకు అందిన విశ్వసనీయ సమాచారంతో ఆయన ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న 10మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.6,600 నగదును స్వాధీనం చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
తక్కెళ్లపాడులో పేకాట స్థావరంపై పోలీసుల దాడి


