హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఈవో ఆకస్మిక తనిఖీ

PPM: ఉల్లిభద్ర జడ్పీ ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్‌ను డీఈవో పి. బ్రహ్మాజీరావు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి భోజనం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల హాజరు, విద్యాబోధన, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు పరిశుభ్రమైన వాతావరణం అందించాలన్నారు.