హైదరాబాద్: 28°C
క్రీడలు

'ఇవే నా చివరి ఆసియా గేమ్స్‌ కావొచ్చు'

భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌. ప్రణయ్‌ ఆసియా క్రీడలపై కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఏషియన్‌ గేమ్సే తనకు చివరివి కావొచ్చని, మరో నాలుగేళ్ల తర్వాత ఇదే స్థాయిలో ఆడగలనో లేదో చెప్పలేనని తెలిపాడు. ప్రస్తుతం శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నానని, గత క్రీడల్లో తృటిలో చేజారిన స్వర్ణ పతకాన్ని ఈసారైనా సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు.