హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: జాతీయ రహదారిపై కొండచిలువ కలకలం

BPT: చెరుకుపల్లి(M) కావూరు వినయాశ్రమం వద్ద జాతీయ రహదారి 216పై భారీ కొండచిలువ ప్రత్యక్షమైంది. రోడ్డుపై పాకుతూ వచ్చిన కొండచిలువతో వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. దీంతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనదారులు, స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు పామును పట్టుకుని సురక్షిత ప్రాంతానికి తరలించే పనిలో పడ్డారు.