ASR: అరకులోయ మండలం లోతేరు వారపు సంతలో తపాలా శాఖ ఆధ్వర్యంలో శనివారం గ్రామీణ తపాలా జీవిత బీమా, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టాఫీస్ పొదుపు పథకాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అరకు సబ్‌డివిజన్ పోస్టల్ ఇన్‌స్పెక్టర్ లక్ష్మీకిషోర్ పాల్గొని పథకాల ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. బ్యానర్లతో సంతలో నిర్వహించిన ర్యాలీతో బీమా, పొదుపు పథకాలపై అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
తపాలా పథకాలపై విస్తృత అవగాహన


