హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సహాయనిది చెక్కుల పంపిణీ

SDPT: కోహెడ మండలంలోని తీగలకుంటపల్లిలో సీఎం సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కోతి ఉదయభాస్కర్, నాయకులు లబ్ధిదారులకు అందజేశారు. తాడిచెట్టు నరసయ్య, రాగుల వెంకటయ్యకు రూ.60 వేల చొప్పున, జాలిగాం శారదకు రూ.27 వేలు, రాగుల మల్లయ్యకు రూ.23 వేల చెక్కులు పంపిణీ చేశారు. పేదలకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తోందని నాయకులు పేర్కొన్నారు.