హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

కృష్ణా: పెనమలూరు మండలం కానూరు గ్రామంలో రూ.1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైనేజీని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయకుండా, పెనమలూరు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.