GDWL: ఎర్రవల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ముగిశాయి. న్యూస్‌పేపర్లతో విద్యార్థులు తయారు చేసిన ప్రత్యేక 'బొజ్జ గణపయ్య' ప్రతిమకు వీడ్కోలు పలికారు. చిన్నారులు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, "మళ్లీ రావయ్యా గణపయ్య.. మా జ్ఞానాన్ని అభివృద్ధి చెందేటట్లు చూడయ్యా" అంటూ నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు వినాయక ప్రతిమను కృష్ణా నదిలో నిమజ్జనం చేశారు.
తెలంగాణ
పాఠశాలలో ఘనంగా నిమజ్జనోత్సవం


