హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్‌లో గణనాథుడికి పూజలు

కరీంనగర్ కలెక్టరేట్‌లో కొలువుదీరిన గణనాథుడికి కలెక్టర్ చిత్రామిశ్రా శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన అన్నదానాన్ని ప్రారంభించి, స్వయంగా సిబ్బందికి భోజనం వడ్డించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ, శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డీఆర్వో స్వామి పాల్గొన్నారు.