హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతి లేకుండా గైర్హాజరైతే చర్యలు: కలెక్టర్

ASF: ప్రభుత్వ ఉద్యోగులు విధుల పట్ల బాధ్యతగా, సమయపాలనతో వ్యవహరించాలని కలెక్టర్ కే.హరిత అన్నారు. ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలను శనివారం ఆకస్మికంగా తనిఖీ చేసి హాజరు పట్టికను పరిశీలించారు. అనుమతి లేకుండా గైర్హాజరైన అసిస్టెంట్ ప్రొఫెసర్లపై చర్యలు తీసుకోవాలని డీఎంఈ అధికారులను ఆదేశించారు. తరచూ విధులకు గైర్హాజరయ్యే వారిని ఉపేక్షించబోమన్నారు.