హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తండ్రి జ్ఞాపకార్థం ఎమ్మెల్యే గొప్ప సాయం

TPT: కోట మండలం నందు ప్రజల సౌలభ్యం కోసం గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్ తన సొంత నిధులతో, తండ్రి కీ.శే. పాసిం పెంచలయ్య జ్ఞాపకార్థం ఒక ఫ్రీజర్ బాక్స్‌ను ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ సహాయం అందించినట్లు ఆయన తెలిపారు.