హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పునరావాస ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలి'

ELR: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం తాడువాయిలో నిర్మిస్తున్న 647 ఇళ్ల నిర్మాణాలను ఈ నెలాఖరుకు పూర్తి చేసి, బాధితులను తరలించాలని జేసి అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో పునరావాస పనులపై ఆయన అధికారులతో సమీక్షించారు. కొత్త ప్రాంతానికి వెళ్లే నిర్వాసితులకు ప్రభుత్వ పథకాలన్నీ నిరాటంకంగా అందేలా చూడాలన్నారు.