హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'గంజాయి సాగుపై నిరంతర డ్రోన్ నిఘా'

ASR: గతంలో గంజాయి సాగు జరిగిన ప్రాంతాలపై పటిష్ట నిఘా కొనసాగుతోందని కొయ్యూరు ఎస్సై పీ.కిషోర్ వర్మ తెలిపారు. ఎస్పీ ఆదేశాలతో శనివారం బకులూరు, బోయవూట, ఎస్ఆర్ పాలెం తదితర గ్రామాల పరిసరాల్లో ముమ్మరంగా డ్రోన్‌తో సర్వే నిర్వహించామన్నారు. గతంలో సాగు చేసిన ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించామన్నారు. అయితే ప్రస్తుతం ఎక్కడా గంజాయి సాగు లేదని ఎస్సై తెలిపారు.