హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణనాథుని లడ్డు లక్కీ డ్రా

MBNR:  మిడ్జిల్ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన మహా గణనాథుని లడ్డు లక్కీ డ్రాలో మాజీ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అల్వాల్‌రెడ్డి విజేతగా నిలిచారు. నిర్వాహకులు లక్కీ డ్రా ద్వారా విజేతను ఎంపిక చేసి భక్తిశ్రద్ధలతో లడ్డును అందజేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌రెడ్డిని నిర్వాహకులు, స్థానిక భక్తులు ఘనంగా అభినందించారు.