WGL: నల్లబెల్లి మండల రైతు వేదికలో వ్యవసాయ శాఖ, ఇఫ్కో ఆధ్వర్యంలో నానో యూరియా, నానో డీఏపీ వినియోగంపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పీఏసీఎస్ ఛైర్మన్ రఘుపతిరావు మాట్లాడుతూ.. నానో ఎరువులతో సాగు ఖర్చులు తగ్గి, దిగుబడులు పెరిగే అవకాశం ఉందన్నారు. పత్తి పంటలో తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రైతులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'నానో ఎరువులపై రైతులకు అవగాహన'


