హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అకాల వర్షానికి రోడ్డుపై కూలిన చెట్టు

ప్రకాశం: వెలిగండ్ల మండలంలో శనివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ఈ భారీ వర్షానికి మండలంలోని హుస్సేన్‌పురం రోడ్డుపై చెట్టు కూలింది. సమాచారం అందుకున్న ఎస్సై కోటేశ్వరరావు సిబ్బంది, స్థానికుల సహకారంతో చెట్టును తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు.