హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించిన సీఐ

SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గిద్ద చెరువులో ఈ నెల 23, 24న జరిగే వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లను సీఐ వెంకటేశ్, ఎస్సై రమేష్, సర్పంచ్ నరసింహులు శనివారం పరిశీలించారు. ప్రశాంతంగా నిర్వహణకు చర్యలు తీసుకోవాలని సీఐ సూచించారు. తొలిసారి క్రేన్ ఏర్పాటు చేస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. పోలీసు, పంచాయతీ సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.