SDPT: కడవేర్గు గ్రామంలో 'సురక్ష నేత్ర' కార్యక్రమంలో భాగంగా 14 సీసీ కెమెరాలను శనివారం అడిషనల్ డీసీపీ కుశాల్కర్ ప్రారంభించారు. సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆదేశాల మేరకు కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రామంలో నేరాల నియంత్రణ, ప్రజల భద్రతకు ఇవి దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేర్యాల సీఐ రమేష్, ఎస్సై అపూర్వ రెడ్డి, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
తెలంగాణ
VIDEO: సీసీ కెమెరాలు ప్రారంభం


