MDK: టేక్మాల్ మండలం వెల్పుగోండలో ప్రపంచ పర్యాటక దినోత్సవం పురస్కరించుకొని ఈనెల 20న ఉదయం 10 గంటలకు హెరిటేజ్ వాక్ నిర్వహిస్తున్నట్లు మన మెదక్ మన చరిత్ర ఆర్గనైజర్ బుర్ర సంతోష్ తెలిపారు. జిల్లాలో అద్భుత శిల్ప సంపద కలిగిన వెల్పుగోండ శ్రీ తంబురేశ్వర స్వామి ఆలయం వద్ద హెరిటేజ్ వాక్ చేపడుతున్నట్లు వివరించారు. అందరూ మన చరిత్రను తెలుసుకోవడానికి పాల్గొనాలన్నారు.
తెలంగాణ
రేపు హెరిటేజ్ వాక్


