హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: సీఎం సభలో స్నాక్స్ కోసం తోపులాట

విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో సీఎం సభ వద్ద గందరగోళం నెలకొంది. దూర ప్రాంతాల నుంచి ఉదయాన్నే వచ్చిన మహిళలు, లబ్ధిదారులు భోజన సమయం కావడంతో ఆకలితో ఒక్కసారిగా స్నాక్స్ కౌంటర్ల వైపు ఎగబడ్డారు. దీంతో అక్కడ తోపులాట నెలకొంది. అధికారులు సమయానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారని పలువురు అభిప్రాయపడుతున్నారు.