ASR: గంజాయి నిర్మూలనలో భాగంగా కొయ్యూరు మండలం బోయఊట, కొత్తవీధి గ్రామాల్లో రైతులకు శనివారం ఏవో పీ.శివరామ్ ప్రసాద్ రాజ్‌మా విత్తనాలను పంపిణీ చేశారు. గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించి, ప్రత్యామ్నాయ వ్యవసాయ పంటలను సాగు చేసుకోవాలని ఏవో రైతులకు సూచించారు. సాంప్రదాయ పంటలతో ఆర్ధికాభివృద్ధి సాధించాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు,
ఆంధ్రప్రదేశ్
'రాజ్‌మా సాగుతో గంజాయి సాగు నిర్మూలన'


