హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల'

NDL: సంజామల మండలంకు సంబంధించి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల తుది జాబితాను శనివారం ఎంపీడీవో సాల్మన్, తహశీల్దార్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రచురించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం, తహశీల్దార్ కార్యాలయం, సొసైటీ కార్యాలయం, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రచురించినట్లు పేర్కొన్నారు. మండల వ్యాప్తంగా 37 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు.